Wednesday, May 1, 2024

చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా సంకల్ప పాదయాత్ర – దండు శ్రీనివాసులు

శింగనమల (ప్రభ న్యూస్): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు ఆధ్వర్యంలో సంకల్ప పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.. ఆయన మాట్లాడుతూ శింగనమల రామస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇక్కడి నుండి పాదయాత్ర గార్లదిన్నె మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు కొనసాగుతుంది కావున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు నాయకులు లు మాజీ యంపిపిలు, మాజీ జెడ్పిటిసిలు, మాజీ ఎంపిటిసి లు, ఎంపిటిసిలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ నాయకులు, పార్లమెంట్ కమిటీ నాయకులు, అనుబంధ సంఘాల కమిటీ నాయకులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, అందరూ హాజరై సంకల్ప పాదయాత్ర విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement