Thursday, May 2, 2024

Breaking: రామాయంపేటలో తీవ్ర ఉద్రిక్తత

మెదక్ జిల్లా రామాయంపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తల్లీ కొడుకు అంతిమయాత్రలో ఉద్రిక్తత నెలకొంది. మృత‌దేహాల‌తో మున్సిపల్ ఛైర్మన్ ఇంటిని ముట్టడించారు. మున్సిపల్ ఛైర్మన్ ఇంట్లో మృత‌దేహాల‌తో ఆందోళన చేస్తున్నారు. మృత‌దేహాల‌ను మృతుల కుటుంబ సభ్యులు మున్సిపల్ ఛైర్మన్ ఇంట్లోకి తీసుకెళ్లారు. అయితే మున్సిపల్ ఛైర్మన్ ఇంటికి తాళం వేసి వెళ్లారు.

కామారెడ్డిలోని లాడ్జిలో ప్రాణాలు తీసుకున్న తల్లి, కొడుకులు వారి మరణానికి రామయంపేటకు చెందిన ఏడుగురు వ్యక్తులే కారణమంటూ సూసైడ్ నోట్, వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
అధికార పార్టీకి చెందిన వ్యక్తులే తమ మరణానికి కారకులు అంటూ తల్లి కొడుకు ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ఉండే వ్యాపారి గంగం సంతోష్ను పల్లె జితేంద్ర గౌడ్, సరాఫ్ యాదగిరి, రామయంపెటలో పనిచేసి బదిలీపై వెళ్లిన సిఐ నాగార్జున గౌడ్, గత కొన్ని రోజుల నుండి వేధించినట్లు వీడియోలో వెల్లడించారు. సిఐ అండ చూసుకుని స్థానికంగా అధికార పార్టీకి చెందిన కీలక నేతలు తీవ్ర ఇబ్బందుల పాలు చేయడంతో పాటు తన వ్యక్తిగత సమాచారాన్ని యాడ్స్ పెట్టి మానసికంగా హింసించడంతో పాటు డబ్బు డిమాండ్ చేశారని పోలీసులు, అధికార పార్టీ ఏకం కావడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో దిక్కుతోచక ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ వీడియోలో వెల్లడించారు.
కామారెడ్డిలో మృతి :
మెదక్ రామయంపేటలో గంగం సంతోష్ స్థానికంగా వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. అయితే వ్యాపార పరంగా ఇబ్బంది కలగడంతో స్థానిక అధికార పార్టీ నేతలను, గతంలో రామయంపేట్ సిఐగా పనిచేసిన నాగరాజ్ గౌడ్ ను సంప్రదించారు. కానీ సమస్య పరిష్కారం కాక పోగా కొత్త సమస్యలు తెచ్చిపెట్టాయి. సంతోష్ బలహీనతలను ఆసరాగా చేసుకుని ఆయన మరణానికి కారణమైన వ్యక్తులు భారీగా డబ్బు డిమాండ్ చేయడంతో సంతోష్ పరిస్థితి చేయిదాటిపోయింది. వేధింపులు తీవ్రతరం కావడంతో ఏమి చేయాలో తెలియని సంతోష్ తన తల్లి పద్మను తీసుకుని మూడు రోజుల క్రితం కామారెడ్డికి చేరుకుని అక్కడ ఓ లాడ్జ్ లో రూమ్ తీసుకుని ఉన్నారు. శుక్రవారం రాత్రి లాడ్జ్ రూమ్ లో సూసైడ్ నోట్ రాసి, వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.. లాడ్జ్ రూమ్ నుండి పొగలు రావడంతో లాడ్జ్ నిర్వాకులు పోలీసులకు సమాచారం ఇవ్వడం, వారు వచ్చి పరిశీలించే సమయానికే ఇరువురు మృతిచెందారు.
ఆందోళనలో వ్యాపారస్తులు :
వ్యాపారి గంగం సంతోష్ అతని తల్లి పద్మ మృతికి అధికార పార్టీ నేతలు, రామయంపేట్ సిఐ గా పనిచేసి వెళ్లిన నాగార్జున గౌడ్ కారణమని సూసైడ్ నోట్, వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపింది. దీంతో రామయంపేట మున్సిపల్ కేంద్రంలోని వ్యాపారులు, ఇతర పార్టీలు ఏకమై రామయంపేట వ్యాపార సముదాయాలను మూయించివేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా ముందే మేల్కొన్న పోలీసులు రామయంపేటలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేయడంతో ఆయా చోట్ల పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఇక వ్యాపార వర్గాలు రామయంపేట బంద్ నిర్వహించారు. కిరాతకులను వదిలిపెట్టవద్దంటూ బంద్ సందర్బంగా వ్యాపారులు నినాదాలు చేయడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement