Tuesday, April 30, 2024

TS: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిరంతరం కృషి.. మోదీ

సంగారెడ్డి: రాష్ట్రాల అభివృద్దే దేశ అభివృద్ది అని తాను నమ్ముతానని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం నాడు పర్యటించారు. దీనిలోభాగంగా సంగారెడ్డి జిల్లాలోని పటేల్ గూడలో రూ.7,200 కోట్ల విలువైన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.

శంకుస్థాప‌ల‌ను, ప్రారంభోత్స‌వాలు.

NH-161 లోని కంది – రామసానిపల్లె సెక్షన్‌లో 4 వరుసల జాతీయ రహదారికి సంబంధించిన రూ.1,409 కోట్ల పనులకు.
NH-167 లోని మిర్యాలగూడ – కోదాడ సెక్షన్ 2 వరుసల జాతీయ రహదారి విస్తరణకు సంబంధించిన రూ.323 కోట్ల పనులకు , NH-65 లోని పుణే – హైదరాబాద్ రహదారిలో సంగారెడ్డి ఎక్స్ రోడ్డు నుంచి మదీనాగూడ మధ్యన 31 కి.మీ.ల 6 లేన్ హైవే 1,298 కోట్లతో చేపట్టే విస్తరణ పనులకు, 399 కోట్లతో NH-765Dలో మెదక్ – ఎల్లారెడ్డి మధ్యన 2 లైన్ హైవే విస్తరణ పనులకు , 500 కోట్లతో NH-765Dలో ఏల్లారెడ్డి – రుద్రూర్ మధ్యన 2 లైన్ హైవే విస్తరణ పనులకు మోదీ శంకుస్థాపనలు వర్చువల్ గా శంకుస్థాపనలు చేశారు.. హైదరాబాద్, సికింద్రాబాద్‌లో రూ.1,165 కోట్లతో చేపట్టిన 103 కి.మీ.ల MMTS ఫేజ్ – II ప్రాజెక్ట్ ను, ఘట్ కేసర్ – లింగంపల్లి మధ్యన కొత్త ఎంఎంటిెెస్ రైలును లాంచనంగా ప్రారంభించారు. అలాగు రూ.3,338 కోట్లతో నిర్మించిన పారాదీప్ – హైదరాబాద్ గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేశారు.

అనంతరం సంగారెడ్డి జిల్లా పటేల్ గూడలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ప్రధాని ప్రసంగిస్తూ, సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ ను ప్రారంభించామని, ఈ సంస్థ వల్ల తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు.
రెండో రోజు తెలంగాణ ప్రజలతో ఉండడం సంతోషంగా ఉందన్నారు.తెలంగాణ అభివృద్దికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. నిన్న ఆదిలాబాద్ నుండి రూ. 56 వేల కోట్ల అభివృద్ది పనులు ప్రారంభించిన విషయాన్ని మోడీ గుర్తు చేశారు. ఇవాళ సంగారెడ్డి నుండి రూ. 7 వేల కోట్ల అభివృద్ది పనులను ప్రారంభించినట్టుగా ఆయన చెప్పారు.

అవినీతిని బయటపెడుతున్నాననే అక్కసుతో కాంగ్రెస్ తనను విమర్శిస్తుందని మోదీ చెప్పారు.వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. కుటుంబ పాలన రాష్ట్రాలకు నష్టం చేస్తుందన్నారు. కశ్మీర్ నుంచి తమిళనాడు వరకు కుటుంబ పాలన ఉన్న రాష్ట్రాల్లో కుటుంబాలే లాభపడ్డాయన్నారు. మోదీని విమర్శించడమే సిద్ధాంతమపరమైన పోరాటమా..? అని ప్రశ్నించారు. కొందరికి కుటుంబమే ముఖ్యమ‌ని, త‌న‌కు దేశం ముఖ్యమన్నారు. కుటుంబ పార్టీలకు ఏమైనా లైసెన్స్ లు ఇచ్చారా అని ఫైర్ అయ్యారు . కుటుంబ పార్టీలతో ప్రతిభ ఉన్నవారికి అన్యాయం జరుగుతుందని అన్నారు. దీనివల్ల యువతకు అవకాశాలు రావడం లేదన్నారు. కుటుంబ పాలన సాగించే వారిలో అభద్రతా భావం ఎక్కువని విమర్శించారు.

- Advertisement -

బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటే అన్నారు. నాణేనికి ఒక వైపు కాంగ్రెస్ అయితే మరోవైపు బీఆర్ఎస్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అవినీతి బంధం ఉందన్నారు. బీఆర్ఎస్ చేసిన కాళేశ్వరం అవినీతిని బయటపెట్టకుండా, విచారణకు ఆదేశించకుండా కాంగ్రెస్ కాపాడే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు మోదీ.. అవినీతి బంధాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ అవినీతిని కప్పిపుచ్చుతోందని ఆరోపించారు. కాళేశ్వరం బీఆర్ఎస్ కు ఏటీఎంలా మారిందన్నారు. అయితే.. కాంగ్రెస్ ఎన్ని రోజులు బీఆర్ఎస్ అవినీతిని కప్పిపుచ్చుతోందో చూస్తామని అన్నారు. అది ఎక్కువ రోజులు నిలవదని అన్నారు. తనకు సర్జికల్ స్ట్రైక్ చేయడం తెలుసని అలాగే ఎయిర్ స్ట్రైక్ చేయడం కూడా తెలుసని వార్నింగ్ ఇచ్చారు.

చెప్పిందే చేస్తా….

మోదీ ఏదైతే చెబుతాడో అదే చేసి చూపుతాన‌ని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టికల్ 370 రద్దు చేసిన విషయాన్ని మోడీ ప్రస్తావించారు.అయోధ్యలో రామమందిరం నిర్మించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రపంచం గర్వించే రీతిలో అయోధ్యలో రాముడి ప్రతిష్టాపన జరిగిందన్నారు..ప్రపంచానికి భారత్ ఆశాకిరణంగా మారిందన్నారు .భారత్ ను ప్రపంచంలో సరికొత్త శిఖరాలకు చేర్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాల్లో తెలుగు ప్రజలు కీలకభూమిక పోషిస్తున్నారని గుర్తు చేశారు. చివ‌ర‌గా ‘అబ్ కీ బార్.. 400 దాటాలి.. బీజేపీకి ఓటు వేయాలి’ అంటూ తెలుగులో మోదీ కోరారు.

మహంకాళి అమ్మవారి సేవ‌లో ప్ర‌ధాని మోదీ..

అంత‌కు ముందు ప్రధాని మోడీ సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆల‌యానికి వ‌చ్చిన ఆయ‌న‌కు అర్చకులు ప్రధానికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంత‌రం ఆయ‌న ఆల‌యంలో అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు చేయించారు.. ఆ త‌ర్వాత అమ్మ‌వారి తీర్ధ ప్ర‌సాదాల‌తో పాటు వేద పండితులు ఆశ్వీర్వ‌చ‌నాలు అంద‌జేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement