Monday, April 29, 2024

నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి గ్రామంలో అంబేద్క‌ర్ విగ్ర‌హం : మంత్రి హ‌రీశ్ రావు

సిద్ధిపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాలను నెలకొల్పుతామ‌ని రాష్ట్ర మంత్రి హ‌రీశ్ రావు అన్నారు. చిన్నగుండవెల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ఆవిష్కరించారు. మంత్రి వెంట సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఎంపీపీ శ్రీదేవి, జెడ్పీటీసీ శ్రీహరి గౌడ్, గ్రామ సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులు, హాజరయ్యారు. ఈసంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ…. మూడ నమ్మకాలను, రూపుమాపి, విద్య పై అవగాహన, చైతన్యం చేస్తూ ప్రజల్ని బయటకు తేవాలన్నారు. అంబేద్కర్ ఆలోచనలను అమలు చేద్దామ‌ని, విద్య ఆవశ్యకతను క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేద్దామ‌న్నారు. అణగారిన వర్గాల పేదరికాన్ని రూపు మాపేందుకు, ఆర్థికాభివృద్ధి సాధనకై సీఎం కేసీఆర్ దళితబంధు తెచ్చారన్నారు. విద్య, ఉద్యోగాల్లో, కాంట్రాక్టుల్లో కూడా రిజర్వేషన్లు తీసుకొచ్చామన్నారు. త్వరలోనే దేశంలోని అన్నీ రాష్ట్రాల్లో కూడా అమలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయన్నారు. విద్యలో పోటీ ప్రపంచాన్ని తట్టుకునేందుకు ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందించేందుకు 7300 కోట్లతో మన ఊరు-మన బడి పథకం తెచ్చామన్నారు. 13 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామ‌న్నారు. తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషల్లో బోధన జరిగేలా చర్యలు చేపట్టామ‌న్నారు. సిద్ధిపేట నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో 50శాతం దళితులకే అవకాశం కల్పించామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement