Thursday, March 28, 2024

అభివృద్ధి పనులను ప్రారంభించిన – మంత్రి కేటీఆర్

వరంగల్,కార్పొరేషన్ (ప్రభ న్యూస్ ) : గ్రేటర్ వరంగల్ పరిధిలో సుమారు రెండు వందల కోట్లకు పైగా నిధులతో శంఖుస్థాపన లు, ప్రారంభోత్సవాల పనులను రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే. తారకరామారావు..మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,మేయర్ లతో ప్రారంభించారు . ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ల్యాండ్ అయి అనంతరం వరంగల్ మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు . అక్కడి నుండి ములుగు రోడ్డు లోని సెంట్రల్ లైబ్రరీ ను ప్రారంభించి, పబ్లిక్ గార్డెన్ ను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ,ఎంపీలు పసునూరి దయాకర్ ,మాలోతు కవిత ఎమ్మెల్సీలు శ్రీనివాసరెడ్డి కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి , చిప్ విప్ వినయ్ భాస్కర్ నరేందర్ , చల్లా ధర్మారెడ్డి, తాటికొండ రాజయ్య ఆరూరి రమేష్ , మేయర్ గుండు సుధారాణి ,డిప్యూటీ మేయర్ రిజ్వాన శమీమ్ మసూద్, మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి , సిపి తరుణ్ జోషి ,కమిషనర్ ప్రావీణ్య, ఆర్డిఓ లు వాసు చంద్ర ,మహేందర్ జి, బల్దియా ఉన్నతాధికారులు ,కార్పొరేటర్లు,తెరాస కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement