Monday, April 29, 2024

అక్రమాలపై విచారణ..

రామాయం పేట : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో ప్రవీణ్ కుమార్ దిష్టిబొమ్మ దగ్థం చేశారు భారతదేశం లో ఉన్న మాజోరిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా విద్యార్థుల లోపల విషబీజాలు నాటే విధంగా ప్రమాణాలు చేస్తూ చదువుల పేరుతో బాలికలపై స్వారో అనే ఒక ఉగ్రవాద సంస్థను స్థాపించి విద్యార్థులను దేశ ద్రోహులుగా తయారు చేస్తున్నారు. అలాగే గురుకుల పాఠశాలలో అమ్మాయిల పైన చేసిన అత్యాచారాలకు కారకులైన దుండగులను కఠినంగా శిక్షించాలి గురుకులలో జరుగుతున్న అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. తెలంగాణలో అవినీతిమయంగా మారిన గురుకులాల కాంటాక్ట్ రద్దు చేసి రద్దు చేసి వారి స్థానంలో పారదర్శకమైన వ్యవస్థను రూపొందించాలి. వీటికి కారకుడైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను విధుల్లో నుండి తొలగించాలని ఎబివిపి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇన్ని జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం అతనిపై చర్యలు తీసుకోకుండా ఉండటంలో మతలబు ఏముందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. లేకుంటే ఎబివిపి ముందస్తుగా ఆందోళన కరమయిన ఉద్యమాలు చేయడానికి సిద్దంగా ఉంది అని వారు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి నగర కార్యదర్శి నరేష్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓంకార్ ఎబివిపినాయకులు శశికాంత్ ,ప్రశాంత్,శివ,నరేష్,దుర్గ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement