Sunday, February 5, 2023

అనుమానాస్ప‌ద స్థితిలో వ్య‌క్తి మృతి..

పటాన్ చెరు : అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యమైన ఘటన పటాన్ చెరు మండలం లాక్డారంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. గ్రామ సమీపంలోని నిర్మాణుస్య ప్రాంతంలో ఓ యువకుడి మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలాన్నిపరిశీలించి.. మృతి చెందిన యువకుడు స్థానిక వడ్డెర కాలనీకి చెందిన జోగన్న (25)గా గుర్తించారు. మృతదేహాన్ని పటాన్ చెరు ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement