Friday, May 3, 2024

హుండీ లెక్కింపు


పాపన్నపేట : ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాదేవి క్షేత్రంలో మహాశివరాత్రి జాతర ఉత్సవాల హుండీ ఆదాయం రూ. 17 లక్షల 93వేల 387 రూపాయలు కానుకల రూపంలో రాగా ప్రత్యేక, ప్రసాదాల, ఒడిబియ్యం, తాత్కాలిక దుకాణాలు, కేషఖండనంల ద్వారా 40లక్షల 67వేల 990 రూపాయలు ఆదాయం దేవాదాయ ధర్మాదాయ శాఖకు సమకూరినట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ సూపరిండెంట్‌ ఇన్స్‌స్పెక్టర్‌ శ్రీనివాసమూర్తి, ఈవో సార శ్రీనివాస్‌లు వెళ్లడించారు. సోమవారం 7 రోజుల జాతర ఉత్సవాల హుండీ లెక్కింపు కార్యక్రమం శ్రీ బ్రమరాంబిక సేవాసమితి సభ్యుల ఆధ్వర్యంలో గోకుల్‌షెడ్డులో నిర్వహించగా బంగారు, వెండి వస్తువులు మినహా 17 లక్షల 93వేల 380 రూపాయల ఆదాయం సమకూరినట్లు పేర్కొన్నారు. దీంతో పాటు జాతర ఉత్సవాల్లో భాగంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రసాదాల విక్రయాల ద్వారా 28లక్షల 94వేల 970 రూపాయల ఆదాయం రాగా ప్రత్యేక దర్శనాల ద్వారా 9 లక్షల 3వేల 740 రాగా ఓడిబియ్యం ద్వారా 64వేల 700 రూపాయలు రాగాకే కేషఖండనం ద్వారా 67వేల 880, తాత్కాలిక దుకాణా సముదాయాలపై 1లక్ష 36వేల 730 రూపాయల ఆదాయం ఆలయానికి సమకూరగా వివిధ విక్రయాలు, దర్శనాలు, కేషకండనం తదితరాలతతో పాటు హుండీ ద్వారా మొత్తం 58లక్షల 61వేల 387 రూపాయలు దేవాదాయ ధర్మాదాయ శాఖకు సమకూరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది లక్ష్మీనారాయణ, సూర్య శ్రీనివాస్‌, మధుసూధన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, విశ్రాంత ఉద్యోగులు సిద్దిపేట శ్రీనివాస్‌, జెన్నరవికుమార్‌, శ్రీనివాస్‌శర్మ, మహేష్‌, యాదగిరి, దీపక్‌రెడ్డి, బ్రహ్మచారి, సాయిరెడ్డి, ఎస్‌ఐ సురేష్‌, పోలీస్‌ సిబ్బంది సీతారాంనాయక్‌, మహేష్‌, గోపాల్‌, ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌లు సంజీవయ్య, ఎం. కుమార్‌, ఏఆర్‌సిసిలు రాములు, భూమయ్య, మోతిలాల్‌, శ్రీనివాస్‌, సిద్దిరాములు, వీరేందర్‌, నరేందర్‌, రమేష్‌ పాల్గొన్నారు.సహాయ సహకారాలు అందించిన అందరికీ దన్యవాదాలు: ఈఓ సార శ్రీనివాస్‌
జాతర ఉత్సవాలను విజయవంతం చేసిన అధికారులకు దేవాదాయ ధర్మాదాయ శాఖ సూపరిండెంట్‌ శ్రీనివాసమూర్తి, ఈఓ సార శ్రీనివాస్‌లు కృతజ్ఞతలు తెలియజేశారు. జాతర మహోత్సవాలలో పాల్గొనేందుకు లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనంకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా సకల సౌకర్యాలు కల్పిండంతో పాటు పారిశుద్ద సిబ్బంది జాతర పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ పారిశుద్దానికి పెద్దపీఠ వేసిన సిబ్బందితో పాటు జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అనుక్షణం పర్యవేక్షిస్తూ జాతర ఉత్సవాలను విజయవంతం చేసిన డీఎస్పీ కృష్ణమూర్తితో పాటు పోలీస్‌ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞ్తలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement