Saturday, May 18, 2024

గ్రామాలలో ఉపాధి హామీ పనులు

పెద్దశంకరంపేట : గ్రామాలలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టబోయే పనులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి పరశురాంనాయక్‌ అన్నారు. పెద్దశంకరంపేట ఎంపీడీవో సమావేశ మందిరంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు రైతుబంధు అధ్యక్షులతో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గ్రామాలలో తప్పకుండా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలన్నారు. వర్మీకంపోస్టు తయారు చేసుకోవాలని, వీటి ద్వారా పంట దిగుబడులు అదికశాతం పొందవచ్చన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఆయా గ్రామాలలో అవసరం మేరకు అభివృద్ది పనులు చేపట్టాలన్నారు. ఉపాధి కూలీలు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పేట ఎంపీపీ జనగం శ్రీనివాస్‌, ఎంపీడీవో రామ్‌నారాయణ, ఎపీవో సుధాకర్‌, వైస్‌ ఎంపీపీ లక్ష్మీ రమేష్‌, ఏడిఏ రాంప్రసాద్‌, ఏవో అమృత్‌, ఏఈఓలు స్వాతి, రాజు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు ఎంపిటిసిలు రైతుబంధు సమితి బాద్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement