Sunday, May 5, 2024

మత్తడి వాగు ప్రాజెక్టు -1 వ గేట్ ఎత్తిన అధికారులు

తాంసి(ప్రభ న్యూస్) : మండలంలోని వడ్డాడి గ్రామ సమీపంలో మత్తడి వాగు ప్రాజెక్టు 1 వ గేట్ ను మంగళవారం ఎత్తినట్లు ప్రాజెక్టు అధికారి హరీష్ పేర్కొన్నారు.గతం 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువనుంచి నీరు వచ్చి చేరుతోంది ప్రాజెక్టు పూర్తి స్థాయి మట్టం277.50 మీటర్లు కాగా ప్రస్తుతం 276.30 మీటర్లకు చేరిందని పూర్తి స్థాయి నీటి నిలువ సామర్థ్యం 0.571 టి ఎం సి లుకాగా ,ప్రస్తుతం 0.424 టి ఎంబసీ లుగా ఉందని తెలిపారు.

ప్రస్తుతం 67.8 మీల్లి మీటర్ల వర్షపాతం నమోదవడంతో ఎగువనుంచి వరద నీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1398 కుసుక్కులు కాగా,ఔట్ ఫ్లో 1398 గా ఉందని తెలిపారు. ప్రాజెక్టు 1 వ గేట్ ఎత్తి నీటిని దిగువకు వదులున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలు,లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రైతులు పశువులను ప్రాజెక్టు పరిసర ప్రాంతాలలోకి వడలవద్దని ప్రాజెక్టు అధికారి సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement