Tuesday, November 28, 2023

CM KCR : మానకొండూరు, స్టేషన్ ఘన్‌పూర్, నకిరేకల్, నల్గొండ సీఎం కేసీఆర్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లు

బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ నాలుగు చోట్లు పర్యటించనున్నారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతుగా మానకొండూరు, స్టేషన్ ఘన్‌పూర్, నకిరేకల్, నల్గొండల‌లో తలపెట్టిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు.

- Advertisement -
   

నల్లగొండ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం జరుగనున్న బహిరంగసభల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు. ముందుగా మానకొండూరు, స్టేషన్‌ ఘనపూర్‌ మీటింగ్స్‌లో పాల్గొన్న అనంతరం కేసీఆర్‌ హెలికాప్టర్‌లో జిల్లాకు రానున్నారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ నుంచి నేరుగా నకిరేకల్‌కు చేరుకుంటారు. నకిరేకల్‌ మూసీ రోడ్డులో ఏఎమ్మార్పీ కాల్వ పక్కనే విశాలమైన ప్రదేశంలో ప్రజా ఆశీర్వాద సభకు ఏర్పాట్లు చేశారు. అనంత‌రం సీఎం కేసీఆర్‌ హెలికాప్టర్‌లో సాయంత్రం 4 గంటలకు నకిరేకల్‌ నుంచి నల్లగొండకు చేరుకుంటారు. పక్కనే కొద్దీ దూరంలోనే హెలిప్యాడ్‌ ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement