Sunday, May 5, 2024

KTR: మ‌ల్కాజిగిరిలో కాంగ్రెస్ కు మ‌డ‌త‌పెట్టి కొట్టుడే – కేటిఆర్…

ఉప్ప‌ల్ – వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్‌ను మడతపెట్టి కొట్టుడే అని బిఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత‌రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. అలాగే, ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి కూడా మంచికే జరిగిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నేడు జరిగిన ఉప్పల్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ ఉప్పల్‌లో జోష్‌ చూస్తుంటే బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉందా? అనే ఫీలింగ్‌ వస్తోంద‌న్నారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో​ మాల్కాజ్‌గిరిలో గెలుపు మనదేన‌ని అన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన 420 హామీలు ప్రజలకు అర్థమయ్యాయ‌ని, కాంగ్రెస్‌ హామీలను నమ్మి మోసపోయామ‌ని ప్ర‌జ‌లు బ‌లంగా న‌మ్ముతున్నార‌ని పేర్కొన్నారు కాంగ్రెస్‌ ప్రభుత్వం కేవలం మాటల సర్కార్‌ అని, చేతల ప్రభుత్వం కాదని తెలుసుకున్నార‌న్నారు.

కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేయకపోతే బొంద పెట్టుడే త‌ధ్యం అన్నారు కెటిఆర్. రేవంత్‌ రెడ్డి మాట్లాడే భాషను చూసి జనం అసహ్యించుకుంటున్నార‌న్నారు.. గ‌ల్లీ లీడ‌ర్ కంటే దిగువ స్థాయిలో చిన్న, పెద్దా తేడా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శించారు… రేవంత్‌లాగా తామేము కూడా తిట్టగలమ‌ని, కానీ, త‌మ‌కు సభ్యత ఉంద‌ని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మన మంచికే వచ్చాయి అనుకుంటున్నాన‌ని, చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తోంద‌ని పేర్కొన్నారు. ఇలా అయినా కాంగ్రెస్‌ పాలన గురించి ప్రజలకు తెలుస్తోంది అంటూ వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement