Monday, April 29, 2024

పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ ఆన్ లైన్ సమావేశాలు..

నాగర్ కర్నూలు : పాఠశాల యాజమాన్య కమిటీల ద్వారా బడి నిర్వహిస్తున్న ఆవాస ప్రాంతంలోని పెద్దలు, విద్యాభిమానులు, తల్లిదండ్రులు, సహకారం ద్వారా ఉపాధ్యాయులు పాఠశాల నిర్దేశించుకున్న లక్ష్యాలను సులభంగా సాధించి, రానున్న విద్యా సంవత్సరంలో పాఠశాలకు కల్పించే వసతుల విషయంలో, బడి ఈడు పిల్లలను బడికి రప్పించడంలో, బడి బయటి పిల్లలను బడికి తిరిగి రప్పించుటలో ఉపాధ్యాయులకు స్థానికులు సహకరించడం‘ ద్వారా సత్ఫలితాలు సాధించేలా జిల్లాస్థాయి, మండలస్థాయి, పాఠశాలస్థాయి, పాఠశాల యాజమాన్య కమిటీల ఆన్ లైన్ సమావేశాలు ఈనెల 23వ, 27వ‌, 30వ తేదీల్లో నిర్వహించనున్నట్లు డీఈవో గోవిందరాజులు ఒక ప్రకటనలో తెలిపారు.
23వ తేదీ శుక్రవారం జిల్లా స్థాయిలో నిర్వహించే పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశంలో అందరూ మండల విద్యాధికారులు,జిల్లాలోని ప్రతి మండలం నుండి స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్, ఎల్ ఎఫ్ ఎల్ హెడ్మాస్టర్, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్, సి ఆర్ పి, ఐ ఆర్ పి, ఉదయం 10 గంటలనుండి మధ్యాహ్నం 1:30 గంటలకు వరకు నిర్వహించే ఆన్లైన్ సమావేశంలో తప్పనిసరిగా పాల్గొనాలని ఆయన ఆదేశించారు.
జిల్లా స్థాయిలో ఆర్ పి లు గా శిక్షణ పొందిన ఆరు మంది నిష్ణాతులైన వారు ఈ నెల 27వ తేదీన మండల స్థాయిలో మండల స్థాయిలో శిక్షణ పొందిన వారు 30వ తేదీన పాఠశాల స్థాయిలో పాఠశాల మేనేజ్మెంట్ కమిటీల ఆన్లైన్ సమావేశాలను విజయవంతం చేయాలని, ఇతర సమగ్ర వివరాలకై కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి బర్పటి వెంకటయ్య 9491868855 నెంబర్ ను సంప్రదించాలని డిఇఓ గోవిందరాజులు ఒక ప్రకటనలో కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement