Wednesday, May 1, 2024

కరోనా నియంత్రణ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

కరోనా విలయ తాండవం నేప‌థ్యంలో క‌రోనా నియంత్ర‌ణ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీక‌రించింది. క‌రోనా వ్యాప్తి నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌పై కేంద్ర ప్ర‌భుత్వానికి నోటీసులు జారీ చేసింది. క‌రోనా ఉద్ధృతి దృష్ట్యా దీనిపై విచార‌ణ జ‌ర‌ప‌నుంది. ఇందులో భాగంగా ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా, రోగుల‌కు అవ‌స‌ర‌మైన ఔష‌ధాలు, వ్యాక్సినేష‌న్ పంపిణీ వంటి అంశాల‌పై విచార‌ణ జ‌రుపుతామ‌ని పేర్కొంది. అలాగే, లాక్‌డౌన్ విధించే అధికారం రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఉంద‌ని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే లాక్‌డౌన్ పై నిర్ణ‌యం తీసుకునే అధికారం న్యాయ‌వ్య‌వ‌స్థ‌కు లేద‌ని స్పష్టం చేసింది. రేప‌టి నుంచి క‌రోనా నియంత్ర‌ణపై విచార‌ణ జ‌ర‌పనున్న‌ట్లు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement