Friday, April 19, 2024

పంచలింగాల చెక్ పోస్ట్ వ‌ద్ద రూ.77 .50 ల‌క్ష‌ల నగదు స్వాధీనం

క‌ర్నూలు – జిల్లాలోని పంచ‌లింగాల చెక్ పోస్ట్ … మొన్న భారీగా బంగారం, నిన్న వెండి, నేడు న‌గ‌దు ప‌ట్టుబ‌డ్డాయి…త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క స‌రిహ‌ద్దులో ప్ర‌వేశించేందుకు ఈ చెక్ పోస్ట్ కీల‌కం కావ‌డంతో పోలీసులు త‌నిఖీలు నిత్యం జ‌రుపుతున్నారు…. తాజాగా పంచలింగాల చెక్పోస్ట్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున 2.45 గంటలకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా భారీగా నగదు పట్లుబడింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న టి ఎస్ ఆర్ టి సి గరుడ ప్లస్ బస్సు నెంబర్ TS 16 Z 0231 లో ప్ర‌యాణిస్తున్న తమిళనాడులోని తుమ్మిచంపతి,ఒద్దంచట్రం తాలూక, దిండిగల్ జిల్లాకు చెందిన‌ మధురాజ్ రెండు బ్యాగులను పోలీసులు సోదా చేశారు. వాటిలో సుమారు రూ.77.50 లక్షలు నగదు గుర్తించారు. . వాటికి సంబందించి ఎలాంటి ఆధారాలు, పత్రాలు చూపలేకపోవ‌డంతో నగదును సీజ్ చేసి తాలూకా పోలీస్ స్టేషన్ నందు అప్పగించారు..న‌గ‌దు త‌ర‌లిస్తున్న వ్య‌క్తిని అరెస్ట్ చేశారు.. .ఈదాడులలో సిఐ.యన్.లక్ష్మి దుర్గయ్య, ఎస్ఐ,జీలాన్ బాషా హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరులు, కానిస్టేబుల్స్ ఇమాం బాషా, సుధాకర్ ,విజయ్ భాస్కర్,సుబాన్ వాలిరామకృష్ణ మరియు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement