Sunday, April 28, 2024

MBNR : పెన్సిల్ తో ఎమ్మెల్యే చిత్రపటం.. బ‌హుక‌రించిన‌ ప్రవళిక..

మక్తల్, మార్చి30(ప్రభ న్యూస్) నారాయణ పేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని అమరచింత మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన నామాల రవి కుమార్తె నామాల ప్రవళిక ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిపై అభిమానంతో విద్యార్థిని ప్రవళిక పెన్సిల్ తో ఎమ్మెల్యే చిత్రపటాన్ని అత్యద్భుతంగా చిత్రీకరించింది.

తాను గీసిన ఈ చిత్రపటాన్ని ఇవాళ ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు అమరచింత పట్టణానికి వెళ్ళిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి విద్యార్థిని ప్రవళిక తను పెన్సిల్ తో చిత్రించిన ఎమ్మెల్యే చిత్రపటాన్ని బహూకరించింది. ఈ సందర్భంగా విద్యార్థిని ప్రవళిక ప్రతిభను మెచ్చుకుంటూ ఎమ్మెల్యే అభినందించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement