Sunday, April 28, 2024

నీటి తొట్టెలో వానరాల జలకాలు..

వీపనగండ్ల : ఒక పక్క కరోనా..మరోపక్క సూర్యుడి భగ భగలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ వేడికి ప్రజలే కాదు మూగజీవాలు కూడా సతమతమవుతున్నాయి. అంతేకాదు ఎండ వేడిమిని తట్టుకోలేక జంతువులు కూడా నీటి కోసం తహ తహ లాడుతున్నాయి. మండల కేంద్రమైన వీపనగండ్ల లో ఎండ తీవ్రతను తట్టుకోలేక కొన్ని వానరాలు ఆస్పత్రికి వెళ్లే మార్గంలో ఒక ఇంటిముందు ఉన్న నీటి తొట్టిలో జలకాలాటలు ఆడుతూ ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందాయి.నీటి తొట్టిలో జలకాలాడుతున్న వనారాలను అటుగా వెళుతున్న ప్రజలు కొద్దిసేపు ఆగి చూసి వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement