Thursday, May 2, 2024

MBNR: ఎంజేఆర్ ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ కు విశేష స్పందన…

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (జులై 25) ప్రభ న్యూస్ : నియోజకవర్గంలోని యువతీ యువకులకు, నియోజకవర్గ ప్రజల కోసం నిర్వహించిన ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ జారీ కార్యక్రమానికి యువత నుంచి విశేష స్పందన వచ్చింది. నాగర్ కర్నూల్ నియోజకవర్గ క్యాంపు కార్యాలయాల్లో లైసెన్స్ దరఖాస్తు చేసుకొనుటకే నియోజకవర్గంలోని ప్రజలు, యువకులు బారులు తీరారు.

ఈ సందర్భంగా పలువురు యువకులు మాట్లాడుతూ.. డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు నాలుగు నుండి 6000 వరకు ఖర్చవుతుందని, డబ్బులు లేక లైసెన్స్ వాయిదా వేసుకుంటూ వచ్చామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఈ విషయం గమనించి ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ జారీ కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషదాయకమని తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement