Monday, April 29, 2024

గ్రామ పంచాయతీ రికార్డులను స్వాధీనం చేసుకున్న డీఎల్పీవో

అచ్చంపేట (ప్రభా న్యూస్): బల్మూర్ మండలం లో కొండనాగుల గ్రామ పంచాయతీకి సంబంధించిన రికార్డులను అచ్చంపేట డీఎల్పీవో శంకర్ నాయక్ స్వాధీనం చేసుకున్నారు ఈ విషయంపై శంకర్ నాయక్ మంగళవారం వివరణ కోరగా గ్రామ పంచాయతీకి సంబంధించి రికార్డులను స్వాధీనం చేసుకున్నామని ఇందుకు సంబంధించి నివేదిక తయారు చేసి డి పి ఓ కు సమర్పించనున్నట్లు చెప్పారు గ్రామపంచాయతీ లో ఎలాంటి తీర్మానాలు లేకుండా నిధులు డ్రా చేయడం ఉప సర్పంచ్ యునూష్ మరికొంత మంది వార్డు సభ్యులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

తమకు సమాచారం ఇవ్వకుండా ఇష్టానుసారంగా పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ లు వ్యవహరిస్తున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు విద్యుత్ స్తంభాలకు సంబంధించి ఎల్ఇడి బల్బులు ఏర్పాటు చేసిన విషయం తమకు వివరించకుండా ఇష్టమొచ్చినట్లు పని చేస్తున్నారని అన్నారు. గ్రామపంచాయతీ రికార్డులు కూడా సరిగ్గా, స్పష్టంగా లేవని అన్నారు బిల్లులకు సంబంధించి రికార్డులో తీర్మానాలు చేయలేదని ఉపసర్పంచ్ యూనూస్ వార్డు సభ్యులు తెలిపారు. గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం అయ్యాయ‌ని ఈ విషయంలో సమగ్ర విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వారు తెలిపారు.

ఇది ఇలా ఉండగా గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం పై జిల్లా పంచాయతీ అధికారి స్వయంగా వచ్చి విచారణ నిర్వహించాలని కాంగ్రెస్ మండల ఎస్సీసెల్ అధ్యక్షులు వెంకటయ్య డిమాండ్ చేశారు సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి నిధుల దుర్వినియోగం లో సూత్ర ధారుడని ఆయన ఆరోపించారు సర్పంచ్ అధికార పార్టీకి చెందిన వారైనప్పటికీ టిఆర్ఎస్ పార్టీకి చెందినవారే ఫిర్యాదు చేయడంలో ఆంతర్యం ఏమిటని పలువురు గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement