Friday, May 17, 2024

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి..


మహబూబ్‌నగర్‌ : రైతుల సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని డిసిసి అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌ ఆరోపించారు. రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ భారత్‌ బంద్‌ కు మద్దతుగా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కేంద్రంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం నుంచి మల్లికార్జున్‌ చౌరస్తా వరకు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఒబేదుల్లా కొత్వాల్‌ మాట్లాడుతూ… వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని గత కొన్ని నెలలుగా రైతులు ఆందోళన చేపడుతున్నప్పటికి కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు. కార్పోరేట్లకు లాభం చేకూర్చడానికే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని దుయ్యబట్టారు. వ్యవసాయ చట్టాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని , వ్యవసాయ రంగం నిర్వీర్యమవుతుందని అన్నారు. వెంటనే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. రైతులు చేపట్టే నిరసనలకు కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు బెక్కరి అనిత , మీడియా కన్వీనర్‌ సిజె బెనహర్‌ , నేతలు ఖాజా అజ్మత్‌ అలీ , సిరాజ్‌ ఖాద్రీ , బాలస్వామి , అబ్దుల్‌ హక్‌ , శ్రీనివాస్‌ , ఎండి తాహెర్‌ , కాంతు , అజీజ్‌ , అలీ , తదితరుతు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement