Tuesday, April 30, 2024

బంద్ విజయవంతం…

మైదుకూరు, : భారత్ బంద్ లో భాగంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బంద్ విజయవంతమైంది. ఈ బంద్ ను ఉద్దేశించి సిపిఐ ఏరియా కార్యదర్శి పి.శ్రీరాములు, ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి ఏవి శివరామ్, సిపిఎం నియోజకవర్గ కార్యదర్శి శివకుమార్ సిపిఎం మండల కార్యదర్శిఎస్.షరీఫ్ లు మాట్లాడుతూ నాలుగు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల సమస్యలను పరిష్కరించకుండా రోజుకో ఊరూ తిరుగుతూ ప్రధాని గారు సీట్ల కోసం ప్రయత్నిస్తున్నారని, 32 మంది విద్యార్థులు బలిదానాలతో 65 గ్రామాల ప్రజల భూములతో 64 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని పోస్కో కంపెనీకి కేవలం 32 వేల కోట్ల రూపాయలకు అప్పనంగా చెప్పడానికి పూనుకుందని, ఎల్.ఐ.సి, బి.ఎస్.ఎన్.ఎల్, బ్యాంక్, రైల్వే, విమానయాన కంపెనీలను ప్రైవేటు పరం చేయడం హేయమైన చర్య అని అన్నారు. విద్యుత్ సంస్కరణల పేరుతో పంపుసెట్లకు మీటర్లు బిగించి రైతులను దగా చేస్తున్నారని, యువతకు ఉపాధి కల్పించకుండా మతం పేరుతో, కులం పేరుతో విద్రోహచర్యలకు పాల్పడేటట్లు యువతను పురిగొల్పుతున్నారని, 44 కార్మిక చట్టాలను 4కోడ్ల గా విభజించి కార్మిక హక్కులను కాలరాస్తున్నారని, వీటన్నింటిని పరిష్కరించలేని ప్రభుత్వం పై మరింత ఆందోళన తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నియోజకవర్గ అధ్యక్షులు పి.భాస్కర్, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు పిరయ్య, థామస్, జయరాజు, ఓబయ్య, కమ్యూనిస్టు పార్టీ నాయకులు బి.వి.శ్రీను బికెఎంయు నాయకులు ఎస్. షావలి, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు షాబుద్దీన్, ఖాదర్ భాష, మహబూబ్ బాషా, దర్జీ నాయకులు కె.వి.రమణ, బస్సు డ్రైవర్ యూనియన్ నాయకులు ఈశ్వరయ్య, చలపతి, సుమో వర్కర్స్ యూనియన్ నాయకులు సుబ్బరాయుడు,షబ్బీర్, మా భాష సిపిఎం నాయకులు దేవ,సుబ్బరాయుడు, ఏఐవైఎఫ్ నాయకులు బాలు, ఏఐఎస్ఎఫ్ నాయకులు పి.పవన్,బాలాజీ,నవీన్, ప్రచేతన్, ప్రవీన్,కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement