Sunday, December 8, 2024

TS : ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

కొత్తూరు, మార్చి 14(ప్రభ న్యూస్): మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం కొత్తూరు మండల పరిధిలోని మక్తాగుడా గ్రామంలో బైక్ ర్యాలీనీ ప్రారంభించారు. ఈ సంధర్బంగా కొత్తూరు మండల పరిధిలోని మక్తగుడా, గూడూరు, మల్లాపూర్, ఇన్ముల్ నర్వ, జేపీ దర్గా మీదుగా బైక్ ర్యాలీ సాగింది.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లీ శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్యాంసుందర్ రెడ్డి, కేశంపేట జెడ్పీటీసీ విశాలశ్రావణ్ రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్ లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement