Monday, April 29, 2024

MBNR: నామినేషన్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి.. మయాంక్ మిట్టల్

మక్తల్, నవంబర్ 2 (ప్రభ న్యూస్) : మక్తల్ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థుల నామినేషన్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్ అధికారులను ఆదేశించారు. గురువారం మక్తల్ త‌హ‌శీల్దార్ కార్యాలయంలో శుక్రవారం నుండి జరగనున్న నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశిస్తూ తహశీల్దార్ కార్యాలయం ముందు అధికారులతో కలిసి ఏర్పాట్లను పరశీలించారు.

ఎన్నికల సిబ్బంది అప్రమత్తంగా ఉండి అభ్యర్థుల నామినేషన్ పరిశీలన, తదితర కార్యక్రమాలపై అప్రమత్తంగా ఉండి నామినేషన్లు తీసుకోవాలన్నారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు జరిగే నామినేషన్ల కార్యక్రమంలో అందరూ హాజరై సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో తహశీల్దార్ సువర్ణ రాజ్, సిఐ రామ్ లాల్, ఎస్ఐ పర్వతాలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement