Sunday, April 28, 2024

Mahabubnagar మున్సిపల్ చైర్మన్ గా ఆనంద్ కుమార్ , వైస్ గా ష‌బ్బీర్ అహ్మద్

మహబూబ్ నగర్,ఫిబ్రవరి 12 (ప్రభ న్యూస్): పాలమూరు పురపాలికలో మున్సిపల్ చైర్మన్ పై గత నెల రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు సోమవారం తెరపడింది.ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో 33 మంది కౌన్సిలర్లతో కాంగ్రెస్ కౌన్సిలర్ ఆనంద్ కుమార్ గౌడ్ మున్సిపల్ చైర్మన్ గా , వై స్ చైర్మన్ గా మహమ్మద్ షబ్బీర్ అహ్మద్ ఎన్నికయ్యారు. ఎన్నికైన నూతన చైర్మన్ వైస్ చైర్మన్ ల తో కలెక్టర్ శివేంద్ర ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇకనుంచి కౌన్సిల్ సభ్యులు ప్రజా సంక్షేమం కోరి పని చేస్తారన్నారు.. అనంతరం చైర్మన్ ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ గా కౌన్సిలర్లు అందరూ తనకు మద్దతు తెలిపి ఓటు వేసి ఎన్నుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement