Saturday, April 27, 2024

Mahabubnagar – ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌ల‌లో వంద శాతం పోలింగ్ – ఓటు హ‌క్కు వినియోగించుకున్న రేవంత్

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కోడంగ‌ల్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల కోటా శాసనమండలి ఉప ఎన్నిక కొనసాగుతోంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ సాయంత్రం 4గంటల వరకు కొనసాగింది . ఈ ఎన్నికల్లో 1439 మంది స్థానిక సంస్థల ఓటర్లు ఉన్నారు. వీరిలో 888 మంది ఎంపీటీసీలు, 83 మంది జెడ్పీటీసీలు, 449 మంది కౌన్సిలర్లు 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నారు. ఈ ఎన్నికలలో మొత్తం ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు..వంద శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెల్లడించారు..

ఇక, ఎన్నికల బరిలో ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ పోటీలో ఉన్నారు. బ్యాలెట్ పత్రాల ద్వారా జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏప్రిల్ రెండో తేదిన నిర్వహంచి అదే రోజు పలితాన్ని వెల్లడిస్తారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement