Tuesday, April 30, 2024

TS : ఎల్ ఆర్ ఎస్ ఫీజు ర‌ద్దు చేయాల్సిందే … కెటిఆర్

ఎల్ ఎర్ ఎస్ ఫీజును ఈ నెల 6వ తేదీలోగా తెలంగాణ ప్రభుత్వం దిగిరాక పోతే తాము న్యాయ పోరాటం చేస్తాం అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటపై కాంగ్రెస్ నేతలు ఎందుకు కట్టుబడి లేరని ప్రశ్నించారు. మార్చ్ 31 లోపు ఎల్‌ఆర్‌ఎస్‌ కట్టమని ఎందుకు అంటున్నారు?, 20 వేల కోట్ల రూపాయల భారం ప్రజలపై వేసేందుకు సిద్ధం అయ్యారు అని కేటీఆర్‌ ఫైర్ అయ్యారు. ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్‌ను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

కోర్టుకు వెళ్లింది మీరే…
తెలంగాణ భ‌వ‌న్ లో నేడు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ‘అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చింది. ఎల్‌ఆర్‌ఎస్‌ పైన కాంగ్రెస్ వైఖరి ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. గతంలో ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం మా ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. కేవలం రూ.1000తో రిజిస్టర్ చేశాము. ఆ రోజు మమ్మల్ని తప్పుపడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోర్టుకు వెళ్లారు. ఆనాడు సీఎల్పీ నాయకుడిగా బట్టి విక్రమార్క ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లించవద్దు అన్నారు. నో ఎల్‌ఆర్‌ఎస్‌-నో టీఆర్‌ఎస్‌ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆనాడు అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటపై ఎందుకు కట్టుబడి లేరు’ అని ప్రశ్నించారు.

ఫ్రీ అని ఇప్పుడు రూ20 వేల కోట్లు వ‌సూలు..
‘మార్చ్ 31 లోపు ఎల్‌ఆర్‌ఎస్‌ కట్టమని ఎందుకు అంటున్నారు. 20 వేల కోట్ల రూపాయల భారం ప్రజలపై వేసేందుకు సిద్ధం అయ్యారు. ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు వసూలు చేసి భారం మోపుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎల్‌ఆర్‌ఎస్‌ను వెంటనే విరమించుకోవాలి. ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్‌ను అమలు చేయాలి. ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌పై వైఖరిని మార్చుకోవాలి. 6వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాకు పిలుపు ఇస్తున్నాం. ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు కోసం హైదరాబాద్‌లోని హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తాం. ఆరోజు అన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ నిరసనలు ఉంటాయి. ఏడో తేదీన కలెక్టర్ల కార్యాలయాల ముందు ధర్నాలు చేస్తాం’ అని కేటీఆర్‌ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement