Tuesday, May 7, 2024

అదుపు తప్పిన బొగ్గు లారీ.. ఇండ్ల‌ల్లోకి దూసుకెళ్లింది..

కాటారం (ప్రభ న్యూస్) భూపాలప‌ల్లి జిల్లాలోని కాటారం వ‌ద్ద బొగ్గు టిప్ప‌ర్ ఇంట్లోకి దూసుకెళ్లింది. భూపాలపల్లి 353 సి నేషనల్ హైవే మీద‌ కాటారం మండలం మద్దులపల్లి స్టేజి వద్ద శనివారం అర్ధరాత్రి ఈ ఘ‌ట‌న జరిగింది. టీఎస్ 03 యూ ఏ 8181 నెంబర్ గల బొగ్గు టిప్పర్ తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ నుండి చెల్పూర్ జెన్కో పవర్ ప్లాంట్ కు లోడుతో వెళ్తోంది. కాగా, టిప్పర్ డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.

శనివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో డోలి మధునక్క, డోలి సదయ్య ఇండ్లలోకి దూసుకెళ్లిన ట్లు బాధితులు పేర్కొన్నారు. టిప్పర్ దూసుకెళ్లిన‌ సమయంలో కృష్ణ లీల ఆమె భర్త శేఖర్, కూతురు ఆద్య గాఢ‌ నిద్రలో ఉన్న‌ట్టు తెలిపారు. రేకుల షెడ్డు కూలి స్వల్పంగా వారికి గాయాల‌య్యాయి. అలాగే పక్కనే ఉన్న డోలి సదయ్య కిరాణా షాపు లోకి కూడా దూసుకెళ్లడంతో కిరణం షాపు కూలిపోయినట్లు బాధితుడు పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement