Thursday, April 18, 2024

GUN FIRE: కలెక్టరేట్ లో తుపాకీ మిస్ ఫైర్.. కానిస్టేబుల్ ఛాతీలోకి దూసుకెళ్లిన బుల్లెట్

కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో తుపాకీ మిస్ ఫైర్ కావడంతో ఓ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. మచిలీపట్నంలో గన్ క్లీన్ చేస్తుండగా.. తుపాకీ పొరబాటున పేలడంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావుకు తీవ్ర గాయం అయింది. బుల్లెట్ ఆయన ఛాతీలోకి దూసుకుపోయింది. దీంతో వెంటనే ఆయనను జిల్లా ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ శ్రీనివాసరావు కలెక్టరేట్ లోని ట్రెజరీ వద్ద గార్డు విధులు నిర్వర్తిస్తున్నారు. తుపాకీని శుభ్రపరిచే క్రమంలో ట్రిగ్గర్ వద్ద చేయి తగలడంతో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement