Monday, April 29, 2024

LIVE – బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవం ప్రారంభం

https://www.youtube.com/live/g71bAP8c4M4?feature=share

హైదరాబాద్ – బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈరోజు ఉదయం 9.30 గంటలకు ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.

ఇక కళ్యాణాన్ని టీవీల్లో వీక్షించేలా లైవ్ఇస్తున్నట్లు నిర్వాహకులు వివరించారు. అలాగే ఆలయానికి చేరుకునేలా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏటా ఆషాడమాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ తల్లి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. కళ్యాణానికి ప్రభుత్వం తరఫున మంత్రులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అమ్మవారి కళ్యాణాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిన్న ఎదుర్కోళ్లు ఘనంగా నిర్వహించగా.. ఇవాల ఎల్లమ్మ కళ్యాణం, రేపు సాయంత్రం రథోత్సవం జరగనుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement