Thursday, May 2, 2024

మద్యం అమ్మకాలకు సాయంత్రం 5 తర్వాతే అనుమతివ్వాలి: ఎమ్మెల్యే సీతక్క

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో మద్యం ఏరులైన పారుతోందని, ఫలితంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం షాపులు, బెల్టు షాపుల కారణంగా గ్రామాల్లో మద్యాహ్నం ఒంటరిగి ఆడవాళ్లు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో పురుషులు పని వదిలి పట్టపగలు తాగుతూ కూర్చుంటున్నారని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మద్యాన్ని సాయంత్రం 5 నుంచి 10 వరకు మాత్రమే అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమేరకు హామీ ఇవ్వాలని సీఎంను కోరారు.

శాసనసభలో బడ్జెట్‌ సంక్షేమ పద్దులపై చర్చలో భాగంగా గురువారం అసెంబ్లీలో ఆమె మాట్లాడారు. పోడు భూముల క్రమబద్ధీకరణకు సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చినా, రైతులు దరఖాస్తు చేసుకున్నా ఫారెస్టు అధికారులు అవేమీ పట్టించుకోకుండా దాడులు చేస్తున్నారని, పంటలను ధ్వంసం చేస్తున్నారని వాపోయారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న వివిధ విభాగాల ఉద్యోగులకూ పీఆర్‌సీని వర్తింప చేయాలని కోరారు. వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి వ చ్చే ఐటీ, ప్రయివేటు పరిశ్రమల్లోనూ 95శాతం ఉద్యోగాలు స్తానికులకే లభించే విదంగా చూడాలన్నారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల కేటాయింపును, నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. పాత్రికేయులకు ఇండ్ల స్థలాలు ఇచ్చి, హెల్త్‌ కార్డులు సరిగ్గా పనిచేసేలా చూడాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement