Tuesday, April 30, 2024

TS : మ‌ల్కాజ్‌గిరిలో తేల్చుకుందాం…రా.. రేవంత్‌కు కేటీఆర్ స‌వాల్‌…

సీఎం రేవంత్‌కు కేటీఆర్ స‌వాల్ విసిరారు. మాల్కాజ్‌గిరి లోక్ సభ స్థానంలో ముఖామఖి తేల్చుకుందాం..రమ్మంటూ రేవంత్ ను ఆహ్వానించారు కెటిఆర్.. తెలంగాణ భవన్ లో నేడు మీడియాతో మాట్లాడుతూ, . సిరిసిల్ల ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా… కొడంగ‌ల్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి పోటీ చేయాలంటూ స‌వాల్ విసిరారు. సేఫ్ గేమ్ వ‌ద్దు.. డైరెక్ట్ ఫైట్ చేద్దామంటూ రేవంత్‌కు పిలుపు ఇచ్చారు..

గ‌తంలోనూ రేవంత్ స‌వాల్ చేసి పారిపోయారని గుర్తు చేశారు. కొడంగ‌ల్, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో స‌వాల్ చేసి రేవంత్ పారిపోయారన్నారు. స‌వాల్ చేసి పారిపోయే రేవంత్ రెడ్డి మాట‌కు విలువేముంది..? అంటు ప్రశ్నించారు. త‌న‌ది మేనేజ్‌మెంట్ కోటా అయితే.. రాహుల్, ప్రియాంక గాంధీది ఏం కోటా..? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. రేవంత్‌ది పేమెంట్ కోటా.. డ‌బ్బులిచ్చి ప‌ద‌వి తెచ్చుకున్నారననారు. పేమెంట్ కోటా కాబ‌ట్టే రేవంత్ ఢిల్లీకి పేమెంట్ చేయాలి. బిల్డ‌ర్లు, వ్యాపారుల‌ను బెదిరించి ఢిల్లీకి రేవంత్ క‌ప్పం క‌ట్టాలి అంటు ఆరోపించారు… రేవంత్ సెస్‌పై త్వ‌ర‌లో బిల్డ‌ర్లు, వ్యాపారులు రోడ్డెక్కుతారు అని కేటీఆర్ పేర్కొన్నారు.

తమ ప్ర‌భుత్వంలో కొన్ని త‌ప్పులు జ‌రిగి ఉండొచ్చు. ప్ర‌భుత్వంలో అన్నీ సీఎం, మంత్రుల‌కు తెలియాల‌ని లేదు. త‌ప్పులు జ‌రిగాయ‌నుకుంటే విచారించి చ‌ర్య‌లు తీసుకోండన్నారు. . మార్చి 2 నుంచి బీఆర్ఎస్ ఎంపీ అభ్య‌ర్థిత్వాల‌పై క‌స‌ర‌త్తు చేస్తామని, ఎంపీ అభ్య‌ర్థిత్వాల‌పై కేసీఆర్ స‌మావేశాలు నిర్వ‌హిస్తార‌ని తెలిపారు.

శుక్రవారం మేడిగడ్డ, అన్నారం వెళ్తున్నామని, అన్నారంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఉంటుందని చెప్పారు. హరీష్ రావు, కడియం శ్రీహరి ప్రజంటేషన్ ఇస్తారని కేటీఆర్‌ తెలిపారు. తమతో పాటు ఇరిగేషన్ నిపుణులు కూడా వస్తారని చెప్పుకొచ్చారు. లీకేజీలు, డ్యామేజీలు కొత్తేమీ కాదని కేటీఆర్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 83 రోజుల్లో తమపై ఆరోపణలు, శ్వేత పత్రాలు తప్ప ఏం చేశారని కేటీఆర్‌ ప్రశ్నించారు.

NDSA వాళ్లు డ్యామ్ లోకి దిగకుండానే రిపోర్ట్ ఇచ్చారన్న కేటీఆర్‌, వాళ్లది పొలిటికల్ ప్రేరేపిత రిపోర్ట్ అని ఆరోపించారు. మీరు తప్పుకోండి మేము నీళ్లిచ్చి చూపెడతామని హరీస్‌ రావు చెప్పిన మాటలను కేటీఆర్‌ గుర్తు చేశారు. మీకు చేతకాకపోతే తప్పుకోండి. మేము చేసి చూపిస్తామని కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. ఏ డిపార్ట్ మెంట్‌లో అయినా రేవంత్ రెడ్డి ఎంక్వైరీలు చేసుకోవచ్చని.. తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement