Saturday, December 9, 2023

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ల‌బ్దిదారుల‌కు అందించిన ఎమ్మెల్యే కూసుకుంట్ల

సంస్థన్ నారాయణపురం సెప్టెంబర్ 27 (ప్రభా న్యూస్): దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఇచ్చిన మాట ప్రకారం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం సర్వెల్ గ్రామంలో 64 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను,28 మందికి ఇండ్ల స్థలాల పట్టాలు, పంచాయితీ కార్యదర్శులకు రెగ్యులరైజేషన్ పత్రాలు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి నిరుపేద కుటుంబానికి చేరుతున్నాయని,బిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలే మూడవసారి కేసీఆర్ ను సీఎం చేస్తాయని అన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement