Sunday, April 28, 2024

బాల్క సుమన్‌ మంత్రి అయితే అద్భుతాలు చేస్తారు: కేటీఆర్‌

మంద‌మ‌ర్రి- రాష్ట్ర మంత్రి , బిఆర్ ఎస్ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటిఆర్ ప్ర‌భుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు.. మందమర్రిలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌తో కలిసి రోడ్‌షోలో పాల్గొన్న మంత్రి.. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ, గతంలో ఓయూ విద్యార్థిగా ఉన్న బాల్క సుమన్‌ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. నియోజకవర్గానికి మంత్రులుగా ఉన్న వాళ్లు చేయని పనులను సుమన్‌ చేసి చూపించారని కొనియాడారు. భవిష్యత్తులో ఆయన మంత్రి అయితే ఇంకా అద్భుతాలు చేస్తారన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో సుమ‌న్ ను భారీ మెజార్టీతో గెలిపించాల‌ని కోరారు కెటిఆర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement