Sunday, April 28, 2024

Nizamabad – దాన ,ధర్మాల్లో ఆర్యవైశ్యులకు సాటి లేరు.. ఆర్యవైశ్య సత్రం లేని పుణ్యక్షేత్రం లేదు.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

నిజామాబాద్ సిటీ, అక్టోబర్ (ప్రభ న్యూస్)1: దాన ..ధర్మాల్లో ఆర్యవైశ్యులకు సాటి ఎవరు లేరని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆర్యవైశ్యుల అభ్యున్నతికి రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని.. ఆర్యవైశ్యులకు బిఆర్ఎస్ అండగా ఉందని అన్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కిషన్ గంజ్ లో ఆర్యవైశ్య సంఘం నూతన భవన ( బిగాల కృష్ణమూర్తి భవన్) ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి సత్యవతి రాథోడ్, అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ,జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠల్, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనా రాయణ, మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా,రామ్ దయానంద్ గుప్తా , ఎంపీపీ గుంత మౌనిక , వెంకటేశం గుప్తా, వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ మంజుల గుప్తా, రేణిగుంట్ల గణేష్ గుప్తా, నిజామాబాద్ నగరం దండు నీతూ కిరణ్ మాజీఎమ్మెల్సీ విజీ గౌడ్ లు ముఖ్య అతిథిలు గా హాజరై నిజాంబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘ భవనాన్ని అట్టహాసంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ .. ఎంతో ఆత్మీయత తో… ఘనంగా స్వాగతం పలికిన ఆర్యవైశ్య ఆడబిడ్డలకు ధన్యవాదాలు తెలిపారు. కొండ కేంద్రం నుంచి అమ్మవారి పాదుకలు దర్శనం చేసుకోవడం నా అదృష్టమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. పూర్వం… పుణ్యక్షే త్రాలకెళితే తినాలంటే తిండి దొరికే పరిస్థితి ఉండేది కాదు… ఆలాంటిది ఏ క్షేత్రంలోనైనా ఆర్యవైశ్యులు సత్రాన్ని ఏర్పాటు చేసి.. రెండు పూటలా అన్నం దొరుకుతుందని భక్తులకు భరోసానిచ్చిన ఘనత ఆర్యవైశ్యులదేనని అభివ ర్ణించారు. దేశంలో ఆర్యవైశ్య సత్రం లేని పుణ్యక్షేత్రం లేదని నొక్కి చెప్పారు.మానవత దృ క్పథంతో తెలంగాణ రాష్ట్ర ప్రజల అభ్యున్నతే ద్యేయంగా కృషి చేస్తున్న ఏకైక పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని తెలిపారు. ఆర్యవైశ్య నిరుపేద ఆడబిడ్డ పెళ్లిలకు బిఆర్ఎస్ కళ్యాణ లక్ష్మి ఇచ్చిఆదుకుంటుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆర్యవైశ్య పట్టణ సంఘ భవన నిర్మాణానికి బిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కోటిన్నర నిధులు ఇచ్చామని తెలిపారు. అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల సొంత డబ్బులతో లక్షల రూపాయలు ఇచ్చి గుణం ఉన్న గణేష్ అన్నగా నిలిచిపో యారని తెలిపారు. నిజాంబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు.

అంతకు ముందు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు, అతిథిలకు నిజాంబాద్ పట్టణ ఆర్యవైశ్యులు ఘనంగా స్వాగ తం పలికారు. అదే విధంగా వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జన్మస్థలమైన పెను గొండ క్షేత్రం నుండి వాసవి శాంతి ధామ్ క్షేత్ర ప్రధాన అర్చకులు పురోహిత సామ్రాట్ అర్చక సార్వభౌమ శిష్టా శేషగిరి మణికంఠ శర్మ , వాచస్పతి వేలేటి గౌరీశంకర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసారు. సుహాసినిలు సామూహిక కుంకుమార్చన లో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా కన్యకా పరమేశ్వరి ఆలయంలో ముఖ్య అతిథులు ప్రత్యేక ప్రజలు చేశారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొండ వీరశేఖర్ గుప్తా , ప్రధాన కార్యదర్శి కసుబ సంపత్ కుమార్ గుప్తా,కోశాధికారి కాపర్తి వెంకటేష్ గుప్తా, పాల్టి రవికుమార్ గుప్తా, అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారులు కార్యవర్గ సభ్యులు ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement