Friday, May 10, 2024

KNR: తెలంగాణకు ఆశాజ్యోతి కేటీఆర్.. గంగుల

తెలంగాణకు ఆశాజ్యోతి మంత్రి కేటీఆర్ అని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ బారాసా నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ లో ఘనంగా తెలంగాణ ఐటి అండ్ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కేక్ కట్ చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై.సునీల్ రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement