Monday, April 29, 2024

కౌలస్ నాల ప్రాజక్ట్ గేట్లు ఎత్తివేత .. ….గంగమ్మతల్లికి పూజ చేసిన ఎమ్మెల్యే

జుక్కల్.. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని సవార్ గాం గ్రామం వద్ద గలా కౌలాస్ నాల ప్రాజక్ట్ పూర్తి స్థాయి తో వరదా నీటితో నిండుకోవటం తో ఇంకా వరదా నీరు పుష్కలంగా వచ్చి చెరటం తో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే,ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్ తో కల్సి ప్రాజక్ట్ వద్ద గంగమ్మతల్లి కి పూజ చేసి రెండు గేట్ల ద్వారా 3794 కూసెక్కుల వరదా గేట్ల ద్వారా వరదా నీరు విడుదల చేశారు,.

వరద కేనాల్ పరిసర గ్రామాల ప్రాంతాల ప్రజలు అపరమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే హన్మంత్ షిండే సూచించారు. కౌలాస్ నాల పూర్తి సామ్యర్థం 458 మీటర్లు కాగా 457.60మీటర్ల నీరు నిల్వ ఉంచుతూ నీటి విడుదల కొనసాగుతుంది,ఈ సందర్భంగా ప్రాజక్ట్ డీఈఈ శేఖర్ రావ్,ఏఈఈ రవిశంకర్, గ్రామ సర్పంచ్ కిషన్ పవర్,ఎంపీపీ భర్త నిలుపాటిల్,మాజీ మార్కిట్ కమిటి చైర్మన్ సాయగౌడ్,బిఆర్ఎస్ మండల అదక్షుడు మాధవ్ రావ్ దేశాయ్, మాజీ అదక్షుడు బొల్లి గంగాధర్,రైతులు పాల్గొన్నారు

కాగా, నిజాంసాగర్ ప్రధాన కాలువ ,ఆటవి ప్రాంతం నుంచి వర్షం నీరు ఎడపల్లి లో అలీసాగర్ చెరువు లో వచ్చి చేరడంతో ప్రాజెక్టు ఓక గేట్ ఎత్తివేశారు దీంతె ఠాణకలాన్,-కుర్నాపల్లీ రోడ్డు పై నీరు పోరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

- Advertisement -

నిజామాబాద్ లోభారీ వర్షం
నిజామాబాద్ రూరల్ మండలం లోని గ్రామాల్లో భారీ వర్షం కురుస్తుంది. మాధవ నగర్ లో నిజాంసాగర్ కెనాల్ నీరు వర్షం నీరు రావడం తో సాయి బాబా ఆలయం చుట్టూ నీరు ప్రవహిస్తోంది భక్తులకు దర్శనం చేసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గుండా రం ఖానా పూర్ సారంగాపూర్ పాళ్దా కాలుర్ శివార్లలో భారీ వర్షాలకు వణుకు కు నాట్లు పూర్తిగా నిలిపి వేశారు. గత కొద్ది రోజులుగా ఇలాగే వర్షాలు కురిస్తే జన్కం పెట్ చెరువు నుండి గుండారం పెద్ద చెరువు నిండి అలుగు పా రే అవకాశం ఉందని స్థానికులు వివరించారు. లక్ష్మా పూర్ జాలల్ పూర్ కేశ పూర్ తీర్మన్ పెల్లి శివార్లలో అక్కడక్కడ వరి పంటలు నీట మునిగాయని రైతులు వివరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement