Thursday, May 2, 2024

మహిళా బాంధావుడు సిఎం కేసీఆర్‌: ఎమ్మెల్యే చందర్‌

గోదావరిఖని, మార్చి 5 (ప్రభన్యూస్‌): మహిళా బాంధావుడు సిఎం కేసీఆర్‌ అని, కేసిఆర్‌ వచ్చాక ఆడపడుచులకు గౌరవం పెరిగిందని రామగుండం ఎమ్మెల్యే, బీ-ఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్‌ అన్నారు. ఆదివారం గోదావరిఖని మార్కండేయకాలనీ లక్ష్మి ఫంక్షన్‌ హాల్‌లో అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయమ్మ ౌండేషన్‌ ఆధ్వర్యంలో మహిళా ప్రతిభోత్సవాలను నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే చందర్‌, రామగుండం పోలీస్‌ కమీషనర్‌ రెమా రాజేశ్వరిలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలను గౌరవించే గొప్ప సంస్కృతి మనదని, సిఎం కెసిఆర్‌ వచ్చాక ఆడపడుచులకు గౌరవం పరిగిందన్నారు. స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పించిన ఘనత కేసీఆర్‌దన్నారు. పేదింటి ఆడబిడ్డలకు వరప్రదాయని కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్‌ పథకాలు పేద వారికి ఆసరాగా నిలుస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తుందని, ఆడపిల్లల తల్లిదండ్రులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు వరంగా మారాయన్నారు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్‌ పథకాలతో బాల్య వివాహాలు తగ్గాయన్నారు. తెలంగాణాలో ఏ ఇంట్లో ఆడబిడ్డ పెళ్ళి జరిగిన ప్రభుత్వ సహకారం ఉండాలని, ముఖ్యమంత్రి కెసిఆర్‌ కల్యాణలక్ష్మి షాదీముబారక్‌ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. మహిళల రక్షణ కోసం షీటీ-ంలు కెసీఆర్‌ కిట్‌ ఆరోగ్యలక్ష్మి ఏర్పాటు- చేశారన్నారు. ఆడబిడ్డల పెండ్లికి సీఎం కేసీఆర్‌ పద్దన్నగా నిలిచి రూ. 1,00,116 అందజేస్తున్నారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మహిళలకు పెద్దపీట వేస్తుందని, మహిళల అభ్యున్నతి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలోని ఆడబిడ్డలకు ఆర్థిక పరిపుష్టితో సాధించేలా కృషి చేస్తున్నామన్నారు. సీపీ రెమా రాజేశ్వరి మాట్లాడుతూ మహళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలన్నారు. చదువుతోనే సమాజంలో గుర్తింపు ఉంటుందని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలంటే చదువు ఒక్కటే మార్గమన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. పోటీ ప్రపంచంలో ఒక లక్ష్యంతో మహిళలు ధైర్యంగా ముందుకు సాగాలన్నారు.

ఈకార్యక్రమంలో నగర మేయర్‌ డాక్టర్‌ బంగీ అనిల్‌ కుమార్‌, డిప్యూటీ- మేయర్‌ నడిపెల్లి అభిషేక్‌రావు, మహిళా ప్రతిభోత్సవ్‌ కార్యక్రమ నిర్వాహకులు మూల విజయారెడ్డి, కల్వచర్ల కృష్ణవేణి, తానిపర్తి విజయలక్ష్మి, తస్నీం భాను, జనగామ కవితా సరోజిని, బాదె అంజలీ దేవి, జెట్టి జ్యోతి, ఈదునూరి పద్మ, శాంత లక్ష్మి, సరితా లక్ష్మి, అమరెదర్‌, సర్వేశ్‌, మేజిక్‌ రాజా, సునిత, రంగజ్యోతి, బిఆర్‌ఎస్‌ నాయకులు పిటి స్వామి, నారాయణదాసు మారుతి, నూతి తిరుపతి, బొడ్డు రవీందర్‌, ఇరుగురాళ్ల శ్రావణ్‌,మేకల అబ్బాస్‌, కుడుదుల శ్రీనివాస్‌, దొమ్మెటి వాసులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement