Saturday, April 20, 2024

కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విలేజ్ డ్రామా.. విశేషాదరణ పోందుతున్న ‘బలగం’

ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిన్న బడ్జెట్ మూవీ ‘బలగం’. ఈ సినిమాకి జబ్బర్దస్త్ హాస్యనటుడు వేణు దర్శకత్వం వహించాడు. గత శుక్రవారం విడుదలైన ఈ మూవీకి స్లోగా పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. హృదయానికి హత్తుకునే కంటెంట్.. ఎమోషన్స్ తో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది. అందుకు తగ్గట్టుగానే కలెక్షన్లు రోజురోజుకూ దూసుకుపోతూ మంచి సినిమాలను ప్రోత్సహించే విషయంలో తెలుగు ప్రేక్షకులే బెస్ట్ అని మరోసారి రుజువు చేస్తోంది.

విలేజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ నెచురల్ సెట్, ఆర్టిస్ట్ ల పెర్ఫార్మెన్స్ ఈ మూవీకి హైలైట్స్ అని చెప్పవచ్చు. అయితే, తెలంగాణా ప్రాంతంలో ఈ సినిమా అద్భుతంగా ఆడుతోంది. మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రాచ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. హన్షితారెడ్డి, హర్షిత్ రెడ్డి ఈ విలేజ్ డ్రామాని నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement