Friday, May 17, 2024

కరీంనగర్ అసెంబ్లీ టికెట్ కేటాయించండి: కాంగ్రెస్ పార్టీకి డాక్టర్ కొనగాల మహేష్ దరఖాస్తు

క‌రీంన‌గ‌ర్ – క‌రీంన‌గ‌ర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని టిపిసిసి అధికార ప్ర‌తినిధి డాక్ట‌ర్ కొన‌గాల మ‌హేష్ కాంగ్రెస్ పార్టీకి ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.. ఆయ‌న గాంధీభవన్ లో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , ఆర్గనైజేషన్ ఇంచార్జ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి త‌న ద‌ర‌ఖాస్తును అంద‌జేశారు.. దీంతో పాటు ఆయ‌న బ‌యోడేటాను, పార్టీకి చేసిన సేవ‌ల‌ను వివ‌రిస్తూ ఒక ఒక లేఖ‌ను అంద‌జేశారు.. గత పది సంవత్సరాలుగా, కాంగ్రెస్ పార్టీకి చేస్తున్న సేవను గుర్తించి రాబోయే ఎన్నికలలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ను తనకు కేటాయించాలని డాక్ట‌ర్ కొన‌గాల కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement