Sunday, May 5, 2024

కోదండ‌రాం మౌన‌దీక్ష.. కేసీఆర్ కు కీలక సూచన

తెలంగాణలో క‌రోనా సంక్షోభ ప‌రిస్థితుల స‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం అనుసరిస్తున్న తీరును నిర‌సిస్తూ టీజేఎస్ అధ్య‌క్షుడు కోదండ‌రాం పార్టీ కార్యాలయంలో ఈ రోజు ఉద‌యం 8 గంట‌ల నుంచి 9 గంట‌ల వ‌ర‌కు మౌన‌దీక్ష‌ చేశారు. దీక్ష విరమించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క‌రోనాతో సామాన్య ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నార‌ని అన్నారు. కొవిడ్ నియంత్రణకు స‌మ‌ర్థంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. ప్ర‌జ‌ల‌కు వైద్యం ఒక హ‌క్కుగా ప్ర‌భుత్వం క‌ల్పించాల‌ని చెప్పారు. ర్యాపిడ్ టెస్ట్ కిట్ల‌ను ప్ర‌జ‌లంద‌రికీ అందుబాటులో ఉంచాల‌ని, గ్రామాల్లో ఐసోలేష‌న్ కేంద్రాల‌ను ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేశారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా అంద‌రికీ వ్యాక్సిన్లు వేయాల‌ని  కోదండరాం కోరారు. కరోనాతో చనిపోయిన కుంటుబాలను ఆదుకోవాలని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై ఒక కమిటీ నిరంతరం పని చేయాలి ప్రభుత్వానికి కోదండరాం డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement