Monday, November 11, 2024

Kharge Fire – హైద‌రాబాద్ ను ఇస్తాంబుల్ చేస్తానన్న కెసిఆర్ వ‌ర‌ద‌ల‌కు నిల‌యంగా మార్చారు…. మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే

హైదరాబాద్‌ను ఇస్తాంబుల్‌గా మారుస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ ఇక్కడి ప్రజల కలలు, ఆకాంక్షలను తుడిచిపెట్టేశార‌ని, భాగ్య‌న‌గ‌రాన్ని వ‌ర‌ద‌ల‌కు నిల‌యంగా మార్చార‌ని విమ‌ర్శించారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే . సికింద్రాబాద్ స‌న‌త్ న‌గ‌ర్, ముషీరాబాద్ నేడు కాంగ్రెస్ అభ్య‌ర్ధుల త‌రుపున ప్రచారం నిర్వహించారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ,హైదరాబాద్‌లో నెహ్రూ కాలంలోనే అనేక పరిశ్రమలు వచ్చాయని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. బీహెచ్‌ఈఎల్‌ వంటి అనేక పరిశ్రమలు కాంగ్రెస్‌ హయాంలో వచ్చాయని తెలిపారు. హస్తం పార్టీ పెట్టిన పరిశ్రమలను మోదీ సర్కారు అమ్ముకుంటోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగంలో కాంగ్రెస్‌ గతంలో ఎన్నో ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. బీఆర్​ఎస్​ సర్కారు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంచిందని విమర్శించారు. కేసీఆర్‌, మోడీ.. పేదలను మరింత పేదలుగా చేస్తున్నారని మండిపడ్డారు.


కేసీఆర్‌, మోదీ.. ధనవంతులకే కొమ్ము కాస్తున్నారని ఖర్గే ఆరోపించారు. కేసీఆర్‌ అవినీతి తెలంగాణ నుంచి ఢిల్లీకి పాకిందన్నారు. ఆప్‌ సర్కారుతో కేసీఆర్‌ కుమ్మక్కయ్యారని.. కేసీఆర్‌ ఆప్‌తో మద్యం స్కామ్‌లో పాలు పంచుకున్నారని చెప్పారు. కుమార్తె కోసం కేసీఆర్ మోడీతో చేతులు కలిపారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మోదీ, కేసీఆర్‌.. ఇద్దరూ అబద్ధాలే చెబుతున్నారని దుయ్యబట్టారు. ఆ ఇద్దరూ ఒక్కటే అని.. వేరు వేరు కాదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి ఇక్క‌డ అధికారంలోకి వ‌స్తే ల్పోయిన హైదరాబాద్‌ వైభవాన్ని తీసుకువ‌స్తామ‌ని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement