Sunday, May 5, 2024

ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. ఖమ్మంలో జీవ వైవిధ్య పక్షోత్సవాలు

ఖమ్మం, ఆంధ్రప్రభ : ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా ఖమ్మం ప్రభుత్వ మహిళా కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన జీవ వైవిధ్య పక్షోత్సవాలు ముగిశాయి. మే 22న మహిళా కళాశాల వృక్ష శాస్త్రం-జంతు శాస్త్రాల విభాగ విద్యార్థుల ఆధ్వర్యంలో పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం చింతకాని మండలం చినమండవ గ్రామంలోని 200 ఏళ్ల నాటి మర్రిచెట్టుతో పాటు పలు చెరువులను విద్యార్థులు సందర్శించారు. వృక్ష కాండం వ్యాసార్థం, దాని భారీ ఊడలు, మర్రిచెట్టు కొమ్మలు అనేక పక్షులు, కీటకాలకు ఆవాసమివ్వడం చూసి విద్యార్థులు అబ్బురపడ్డారు.

సహజ సిద్ధమైన చెరువులు, అవి ఆవాసమిస్తున్న జంతు జాతులను గమనించారు. ఈ క్షేత్ర పర్యటనలో కళాశాల వృక్ష శాస్త్ర అధ్యాపకులు పి.కృష్ణవేణి, గ్రీన్ వే నిర్వాహకులు రవికుమార్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ చక్రవర్తి, ఎఫ్.బి.ఓ, గ్రామ సర్పంచ్, గ్రామస్తులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement