Sunday, May 5, 2024

వ‌న‌మా పెద్ద‌రికం.. వృద్ధురాలి చేయిప‌ట్టుకుని రోడ్డు దాటించిన ఔదార్యం

కొత్త‌గూడెం ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర్‌రావుకు ఈ మ‌ధ్య‌నే వెన్నెముక ఆప‌రేష‌న్ జ‌రిగింది. ఆప‌రేష‌న్ త‌ర్వాత‌ రెస్ట్‌లో ఉండాల్సిన త‌ను ఇవ్వాల (బుధ‌వారం) పాల్వంచలోని ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌య్యారు. మంచుకంటి న‌గ‌ర్‌లో నిర్వ‌హిస్తున్న ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మానికి తహసీల్దార్‌తో క‌లిసి వ‌చ్చారు. అయితే ఈ క్ర‌మంలో ఆ దారిలో వెళ్తున్న ఒక ఓల్డ్ ఏజ్ మ‌హిళ (పెద్ద‌మ్మ‌) నడవలేక పోతుండ‌డం చూశారు.

త‌న హెల్త్ బాగాలేకపోయినా రోడ్డు దాటేందుకు ఆ వృద్ధురాలు ప‌డుతున్న బాధ‌ను చూసి ఆమె చేయిప‌ట్టుకుని రోడ్డు దాటించారు. ఇది చూసిన అక్క‌డి జ‌నం వ‌న‌మాపై మ‌రింత అభిమానం పెంచుకుని ఈ ఫొటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement