Wednesday, May 1, 2024

ముంద‌స్తు జాగ్ర‌త్త చ‌ర్య‌లు చేపట్టండి : మంత్రి పువ్వాడ

ఖ‌మ్మం : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో తక్షణమే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులకు సూచించారు. నగర మేయర్ నీరాజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి తో కలసి కాల్వ వడ్డు మున్నేరు ప్రాంతాన్ని సందర్శించారు. వివిధ ప్రాంతాల్లో పెరుగుతున్న వరద ఉదృతి దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎటువంటి కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అనంతరం హ‌రితహారంలో భాగంగా నగరంలోని లకారం ట్యాంక్ బండ్ ప్రాంతంలో మొక్కలు నాటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement