Monday, May 6, 2024

వానర ప్రేమ… కోతికి కరెంట్ షాక్.. కాపాడిన మ‌రో కోతి..! (ఇదిగో విడియో..)

ఖమ్మం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్ వద్ద సోమవారం ఉదయం పత్తి మార్కెట్ ఎదురుగా కరెంట్ షాక్ కొట్టి ఒక కోతి కింద పడగా, మరో కోతి అత్యవసర సపర్యలు చేస్తూ దాని ప్రాణాన్ని కాపాడింది. ఒక చెట్టు మీద నుండి మరో చెట్టు మీదకు పరిగెత్తుతున్న సమయంలో కోతికి కరెంట్ షాక్ తగిలి కింద పడిపోయింది. కరెంట్ షాక్ తో కోతి స్పృహ కోల్పోవడంతో గమనించిన మరో కోతి వెంటనే దాని దగ్గరకు చేరి నెమరి కొరుకుతూ ప్రాణాన్ని కాపాడింది. మానవత్వాన్ని మరిచిపోతున్న నేటి ఆధునిక సాంకేతిక యుగంలో వానరాన్ని చూసైనా ప్రతి ఒక్కరు నిజజీవితంలో కొంత వరకైనా ఆపదలో ఉన్న వారికి, తోటి వారికి సహాయం అందించాలనే ఆలోచనను ఈ వానరం కలిగింప చేయడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement