Thursday, May 2, 2024

తెలంగాణ వ్యాప్తంగా డయాగ్నస్టిక్ కేంద్రాల ప్రారంభం

తెలంగాణలో తొలివిడతగా ఎంపిక చేసిన జిల్లాల్లో ఉచిత డయాగ్నస్టిక్ కేంద్రాలు ప్రారంభం అయ్యాయి. 19 జిల్లాలలో ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్ సెంటర్లను ఆయా జిల్లాల మంత్రులు ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మంత్రి హరీష్ రావు ప్రారంభించగా.. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో పువ్వాడ అజయ్ కుమార్ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. దీంతో పేదలు ఉచితంగా డయాగ్నస్టిక్ సేవలు పొందవచ్చని అజయ్ ఈ సందర్భంగా అన్నారు.

మరోవైపు వికారాబాద్ ప్రభుత్వాస్పత్రిలో తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్‌ను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..57 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు ఇక నుంచి ఉచితంగా అందుబాటులోకి వస్తాయన్నారు. దీంతో ఎంతో మంది పేదలకు వైద్య ఖర్చుల భారం తప్పుతుందన్నారు.ఈ మేరకు జిల్లా ప్రజల తరుఫున సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి , ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్ , కాలే యాదయ్య, పట్నం నరేందర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, కొప్పుల మహేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పౌసుమి బసు, రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయాల సంస్థ ఛైర్మన్ నాగేందర్ గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement