Friday, April 19, 2024

వేణు నెక్స్ట్ సినిమా నానితోనే?

ఇటీవల వకీల్ సాబ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు డైరెక్టర్ శ్రీరామ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ ను అందుకుంది. అయితే ఈ సినిమా తర్వాత వేణు ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేది ప్రశ్నగా మారింది. తాజా సమాచారం ప్రకారం శ్రీరామ్ ఇటీవల నేచురల్ స్టార్ నానికి ఓ స్టోరీ లైన్ కూడా చెప్పాడట. అది నచ్చడంతో పూర్తి స్క్రిప్టు రాసుకుని రమ్మని చెప్పాడట. నిజానికి అల్లు అర్జున్ తో ఐకాన్ సినిమా వేణు శ్రీరామ్ చేయాల్సి ఉంది. కానీ అది ఇప్పుడు అప్పుడే కార్యరూపం దాల్చేలా కనిపించట్లేదు.

ఇక నాని విషయానికి వస్తే నాని సినిమా టక్ జగదీష్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అలాగే శ్యామ్ సింగ్ రాయ్, అంటే సుందరానికి మూవీలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ తర్వాత వేణు శ్రీరామ్ నాని చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక గతంలో నాని వేణు శ్రీరామ్ కాంబినేషన్లో ఎంసీఏ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాను కూడా దిల్ రాజు నిర్మించారు. ఇప్పుడు ఈ సినిమాను కూడా దిల్ రాజు నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement