Monday, April 29, 2024

గోదావరి వరదలపై మంత్రి పువ్వాడ ఉన్నత స్థాయి సమీక్ష

భద్రాచలం : భద్రాచలం గోదావరి వరదలు, ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు, వరద ప్రాంతంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు, వరద ప్రాంతంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. భద్రాచలం ఐటీడీఏ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య, రోడ్లు & భవనాలు, పంచాయతీ రాజ్, విద్యుత్, మిషన్ భగీరథ, ఇరిగేషన్, పోలీస్ అధికారులు, సీసీఎల్ ఏ డైరెక్టర్ రజత్ కుమార్ షైనీ, సింగరేణి సీఎండీ శ్రీధర్, పంచాయతీ రాజ్ కమిషనర్ హనుమంత్ రావు, జిల్లా కలెక్టర్ అనుదీప్, జిల్లా ఎస్పీ వినీత్, ఐటీడీఏ పీవో గౌతమ్, జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఆయా శాఖా జిల్లా ఉన్నతాధకారులు ఉన్నారు.

అధికారులు క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండి స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు. వ‌ర్షాలు త‌గ్గినందుకు మ‌ర‌ద కూడా త‌గ్గుముఖం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని, అయిన‌ప్ప‌టికీ అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని, నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సహాయక చర్యలను కొనసాగించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement