Friday, March 29, 2024

విభజన హామీలపై.. ఢిల్లీ రాజ్ ఘాట్ లో కేఏ పాల్ మౌన దీక్ష

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మౌన దీక్ష చేపట్టారు. తెలుగు రాష్ట్రాల విభజన హామీల అమలు కోసం ఢిల్లీ రాజ్ ఘాట్ లో మౌన దీక్ష చేస్తున్నారు. మద్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు కేఏ పాల్ మౌన దీక్ష చేయనున్నారు. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా, తెలంగాణకు అభివృద్ధి ప్యాకేజ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 8 ఏళ్లుగా విభజన హామీలను కేంద్రం, ప్రధాని మోడీ అమలు చేయడం లేదని విమర్శించారు. జీవితంలో మొట్ట మొదటిసారిగా రాజ్ ఘాట్ లో మూడు గంటల పాటు మౌన దీక్ష చేస్తున్నానని తెలిపారు.

తనతోపాటు మూడు గంటల పాటు దీక్ష చేయలేని వారు మూడు నిముషాలైనా దీక్ష పాటించండని పిలుపునిచ్చారు. ఈరోజు 2కోట్ల10 లక్షల మంది తనతో పాటు ఉపవాసం ఉంటున్నారని వెల్లడించారు. విభజన హామీల అమలు కోసం వచ్చే బుధవారం ఉదయం జంతర్ మంతర్ వద్ద నిరసన చేపడతానని ప్రకటించారు. విభజన హామీలు అమలు కాలేదు కాబట్టి తాను రాజ్ ఘాట్ లో మౌన దీక్ష చేస్తున్నట్లు కేఏ పాల్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement