Thursday, May 9, 2024

ఖమ్మంలో ‘సోనూసూద్’

ఖమ్మం : కరోనా సమయంలో హీరో సోనూసూద్‏ రియల్ హీరోగా మారి పలువురికి సహాయాన్ని అందించారు. దాంతో తమ ఆరాధ్య దేవుడిగా కొలిచారు.  మరికొంతమంది వలస  కార్మికులు తమ దుకాణాలకు ఆయన పేరు పెట్టుకొని కృతజ్ఞత చాటుకున్నారు. ఇదిలా ఉంటే  ఖమ్మం జిల్లాకు చెందిన ఓ జంట తమ కూతురికి సోనూ సూద్ పేరు వచ్చేలా.. సోనాలి సూద్ అని పేరు పెట్టుకున్నారు.  తాజాగా వారిని కలిసారు రియల్ హీరో. బోనకల్ మండలం ముష్టికుంట్ల గ్రామానికి చెందిన పండగ నవీన్ ఆర్ఎంపీగా పనిచేస్తుంటారు. నవీన్, త్రివేణి దంపతులకు ఇటీవల కూతురికి జన్మించింది. ఆ చిన్నారికి సోనాలి సూద్ అని పేరు పెట్టారు. ఫిబ్రవరి 2న పాపకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు రావాలంటూ.. సోనూసూద్‏ను ఆహ్వానిస్తూ.. ఆహ్వాన పత్రికను ముద్రించారు. ఇక ఆ పత్రిక సోషల్ మీడియాలో హాల్ చల్ చేసిన సంగతి తెలిసిందే… ఇదిలా ఉంటే.. రియల్ హీరో ఆ జంటను కలిశారు. ఆ కుటుంబాన్ని కలిసి.. వారితో సెల్ఫీ తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement